ఆ సీన్ చేస్తున్నప్పుడు చాలా అసౌకర్యంగా అనిపించింది.. ముద్దు సన్నివేశంపై కాజోల్ వ్యాఖ్యలు

  • 'ద ట్రయల్' సిరీస్ లో అధర చుంబనం సీన్
  • మూడు దశాబ్దాల కెరీర్ లో తొలిసారి నో కిస్సింగ్ పాలసీని పక్కనపెట్టిన కాజోల్
  • ఆ పాత్రలోని భావోద్వేగాలను పండించడానికి ఆ సీన్ అవసరమని వెల్లడి

బాలీవుడ్ నటి కాజోల్ తన మూడు దశాబ్దాల కెరీర్‌లో మొదటిసారి తన 'నో కిస్సింగ్' పాలసీని పక్కనబెట్టి వార్తల్లో నిలిచారు. తన ఓటీటీ డెబ్యూ సిరీస్ 'ద ట్రయల్' కోసం ఈ నిబంధనను అతిక్రమించి, సహనటుడు జీషూ సేన్ గుప్తాతో కిస్ సీన్‌లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.


తాజాగా ఒక యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో కాజోల్ మాట్లాడుతూ, ఆ సన్నివేశం చిత్రీకరించేటప్పుడు తాను అనుభవించిన మానసిక సంఘర్షణను బయటపెట్టారు. "ఆ సీన్ కేవలం శృంగారం కోసం పెట్టింది కాదు. కథా పరంగా ఆ పాత్రలోని భావోద్వేగాలను పండించడానికి అది చాలా అవసరం. అందుకే కథ విన్నప్పుడు ఓకే చెప్పాను. కానీ సెట్స్‌కి వెళ్ళాక చాలా అసౌకర్యంగా అనిపించింది. చివరి నిమిషంలో 'ఇది చేయను' అని చెప్పేద్దామని అనుకున్నాను. కానీ వృత్తిధర్మం కోసం నా ఇబ్బందిని పక్కనబెట్టి నటించాను" అని ఆమె వివరించారు.


1999లో హీరో అజయ్ దేవగణ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న కాజోల్‌కు నైసా, యుగ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయిన తర్వాత కూడా నటనలో తనదైన ముద్ర వేస్తున్నారు.


Kajol
bollywood
kiss

More Telugu News